
14, నవంబర్ 2025, శుక్రవారం 2:07:16 PMకి
చిత్తూరు జిల్లా మంగళంపేటలో పవన్ కల్యాణ్ అటవీ భూముల ఏరియల్ సర్వే చర్చనీయమైంది. అక్కడి 32.63 ఎకరాలు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల ఆక్రమణలో ఉన్నాయని ఏపీ అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ చలపతిరావు అంటున్నారు. ఇంతకీ ఏమిటీ వివాదం? దీనిపై పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?.

14, నవంబర్ 2025, శుక్రవారం 2:13:29 PMకి
ఏడో నిజాం పాలనకు 25 ఏళ్లు పూర్తిఅయిన సందర్భంగా బంజారాహిల్స్ పక్కనే వెయ్యి ఎకరాల ప్రాంతాన్ని నిజాం ప్రభుత్వం నోటిఫై చేసింది. అక్కడ నివాసాలకు అనుమతించాలని నిర్ణయించింది. నిజాం పాలనకు 25 ఏళ్లు కావడంతో “సిల్వర్ జూబ్లీ” పదంలోంచి జూబ్లీని తీసుకుని ఆ ప్రాంతానికి జూబ్లీహిల్స్ అని పేరు పెట్టారు.

14, నవంబర్ 2025, శుక్రవారం 12:41:52 PMకి
నితీశ్ కుమార్ కాలేజీలో చదివే రోజుల్లో రాజ్ కపూర్ చిత్రాలను ఎంతగానో ఇష్టపడే వారని ‘నితీశ్ కుమార్: ద రైజ్ ఆఫ్ బిహార్’ పుస్తకంలో అరుణ్ సిన్హా ప్రస్తావించారు. చదువుకునే రోజుల్లో ఆయనకు 150 రూపాయల స్కాలర్ షిప్ అందేది. దాంతో ఆయన ఎక్కువగా పుస్తకాలు కొనుక్కునేవారు.

14, నవంబర్ 2025, శుక్రవారం 10:02:54 AMకి
మొదటి రెండు రౌండ్లు కాంగ్రెస్ ముందంజలో ఉండగా, మూడో రౌండ్లో బీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత ప్రతీ రౌండ్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి దూసుకుపోయారు. కౌంటింగ్ మొత్తం పది రౌండ్లు జరగ్గా, అందులో తొమ్మిది రౌండ్లలో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది.

14, నవంబర్ 2025, శుక్రవారం 9:36:37 AMకి
ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామి అయిన భారతీయ జనతా పార్టీ 87 స్థానాల్లో విజయం సాధించగా, మరో రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక జేడీయూ 79 స్థానాల్లో విజయం సాధించగా, మరో ఆరు చోట్ల ఆధిక్యంలో ఉంది.

14, నవంబర్ 2025, శుక్రవారం 10:31:03 AMకి
'’అల్-ఫలాహ్ యూనివర్సిటీలో ముజమ్మిల్ బోధించేవారు. ఆయన నుంచి ఒక కిర్నికోవ్ రైఫిల్, ఒక పిస్టల్, టైమర్, 360 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాం. కానీ, ఇది ఆర్డీఎక్స్ కాదు’’ అని ఫరీదాబాద్ పోలీస్ కమిషనర్ సతేంద్ర గుప్తా తెలిపారు.

14, నవంబర్ 2025, శుక్రవారం 8:16:10 AMకి
మహిళలకు వేతనంతో కూడిన నెలసరి సెలవును అందించాలని కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంఘటిత రంగంలో పనిచేస్తున్న 18 నుంచి 52 ఏళ్ల వయసున్న మహిళలు నెలకోసారి ఈ సెలవును తీసుకోవచ్చు.

14, నవంబర్ 2025, శుక్రవారం 6:21:39 AMకి
ఇది 1950 నాటి మద్రాస్ సినిమా ఇండస్ట్రీ నేపథ్యంతో సాగే కథ. ప్రారంభంలోనే ఒక ముసుగు మనిషి చేతిలోని రివాల్వర్ పేలుతుంది. క్రైం ఆధారిత కథగా లీడ్ ఇచ్చిన తరువాత అసలు విషయం మొదలవుతుంది.

28, అక్టోబర్ 2025, మంగళవారం 7:23:45 AMకి
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.

3, అక్టోబర్ 2025, శుక్రవారం 7:20:54 AMకి
బయటివారికి ఇదొక వేషంలా కనిపిస్తుంది కానీ, తుళు ప్రజలకు మాత్రం ఆ రూపం దైవం. అందుకే బయట ప్రాంతాల్లో దీన్ని ప్రదర్శించడానికి వారు ఇష్టపడరు. వేషంగా వేసుకుంటే సహించరు. భక్తితో పాటు భయం ఉంచడం కూడా లక్ష్యం అంటారు.

19, ఆగస్టు 2025, మంగళవారం 6:28:24 AMకి
18వ శతాబ్దం నాటికే అరుణాచలం దగ్గర తెలుగు శాసనాలు కనిపించాయి. ప్రస్తుత అరుణాచల గోపుర నిర్మాణం ప్రారంభించింది శ్రీకృష్ణదేవరాయలు అయితే, దాన్ని పూర్తి చేసింది తంజావూరు తెలుగు పాలకుడు సేవప్ప నాయకుడు.

5, జనవరి 2025, ఆదివారం 1:32:08 PMకి
'’సమాజంలో ఒంటరిగా నివసిస్తున్న, విడాకులైన, లేదా భాగస్వాములను కోల్పోయిన వారి లైంగిక అవసరాల గురించి ఎవరూ మాట్లాడరు.’’

31, అక్టోబర్ 2024, గురువారం 5:45:08 AMకి
మన సమాజంలో అత్తా కోడళ్లకు సరిగా పొసగదనే అభిప్రాయం ఉంది.ఈ అత్తాకోడళ్ల ‘బంధం’ మీదనే సంవత్సరాల పాటు నడిచే సీరియళ్లు ఉన్నాయి. అయితే సమాజంలో ఉండే పాపులర్ పరసెప్సన్కు భిన్నంగా ఫ్రెండ్లీగా జీవించే అత్తా కోడళ్లు కూడా ఉన్నారు.